జేడీ దర్శకుడిగా ఎమోషనల్ థ్రిల్లర్
ABN , First Publish Date - 2023-08-13T00:44:08+05:30 IST
జేడీ చక్రవర్తి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘హూ’. రెడ్డమ్మ కే. బాలాజీ నిర్మించారు. శుభ రక్ష, నిత్య హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని...

జేడీ చక్రవర్తి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘హూ’. రెడ్డమ్మ కే. బాలాజీ నిర్మించారు. శుభ రక్ష, నిత్య హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఇటీవలె ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని యూనిట్ నిర్వహించింది. నిర్మాత ప్రసన్నకుమార్, నటుడు నాగ మహేశ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. టైటిల్ పోస్టర్‌ను నిర్మాత ఆచంట గోపీనాథ్, శోభారాణి, కొల్లి రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత బాలాజీ మాట్లాడుతూ ‘తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తీశాం. ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్. జేడీ నటించిన ‘దయ’ వెబ్‌సిరీస్ లానే మా ‘హూ’ చిత్రం కూడా పెద్ద హిట్టవ్వాలి’ అని కోరుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్ చంద్. సినిమాటోగ్రఫీ: ఎంబీ అల్లికట్టి