ప్రేక్షకుల్ని మెప్పించే మను చరిత్ర
ABN, First Publish Date - 2023-06-21T03:46:11+05:30
శివ కందుకూరి కథానాయకుడిగా నూతన దర్శకుడు భరత్ పెదగాని తెరకెక్కించిన చిత్రం ‘మనుచరిత్ర’. మేఘా ఆకాశ్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలు. ఎన్ శ్రీనివాసరెడ్డి నిర్మించారు. ఈ నెల 23న విడుదలవుతోన్న సందర్భంగా...
శివ కందుకూరి కథానాయకుడిగా నూతన దర్శకుడు భరత్ పెదగాని తెరకెక్కించిన చిత్రం ‘మనుచరిత్ర’. మేఘా ఆకాశ్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలు. ఎన్ శ్రీనివాసరెడ్డి నిర్మించారు. ఈ నెల 23న విడుదలవుతోన్న సందర్భంగా ఇటీవలే చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన కార్తికేయ మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమం ‘ఆర్‌ఎక్స్ 100’ రీయూనియన్‌లా అనిపిస్తోంది. ఈ సినిమా కూడా అంత పెద్ద విజయాన్ని అందుకోవాలి. ట్రైలర్ చూసినప్పుడు శివ హీరోగా నాకు పోటీ అవుతాడు అనిపించింద’న్నారు. శివ కందుకూరి మాట్లాడుతూ ‘‘మను చరిత్ర’ నాకు చాలా స్పెషల్ మూవీ. చాలా ప్రేమిస్తూ చేసిన సినిమా ఇది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది’ అని చెప్పారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని దర్శకుడు అజయ్ భూపతి ఆకాంక్షించారు. ‘మనుచరిత్ర’ చాలా స్వచ్ఛమైన ప్రేమకథ, ఇందులో మేఘా ఆకాశ్ పాత్ర గుర్తుండిపోతుందని భరత్ తెలిపారు.