కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అమితాబ్‌ అభిమాన రచయిత మృతి

ABN, First Publish Date - 2023-09-25T01:10:50+05:30

బాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌ హిట్లు ఇచ్చిన రచయిత ప్రయాగ్‌ రాజ్‌ (88) వృద్ధాప్య సమస్యలతో శనివారం సాయింత్రం ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు...

బాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌ హిట్లు ఇచ్చిన రచయిత ప్రయాగ్‌ రాజ్‌ (88) వృద్ధాప్య సమస్యలతో శనివారం సాయింత్రం ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. దాదాపు వంద చిత్రాలకు కథకుడిగా, స్ర్కీన్‌ ప్లే రచయితగా పని చేశారు ప్రయాగ్‌. అమితాబ్‌ బచ్చన్‌తో ప్రయాగ్‌కి మంచి అనుబంధం ఉంది. బిగ్‌ బీ సూపర్‌ హిట్‌ చిత్రాలైన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’, ‘గిరఫ్తార్‌’, ‘నసీబ్‌’, ‘కూలీ’ తదితర చిత్రాల విజయంలో ప్రయాగ్‌ భాగస్వామ్యం ఉంది. ఆయన ఆఖరి చిత్రం ‘జమానత్‌’ అనివార్య కారణాల వల్ల విడుదలకు నోచుకోలేకపోయింది. ‘‘నా అభిమాన రచయిత ప్రయాగ్‌ మన మధ్య లేకపోవడం తీరని లోటు. బాలీవుడ్‌ మూల స్థంభం కూలిపోయింది’’ అంటూ బిగ్‌ బీ తన సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ముంబైలో ప్రయాగ్‌ అంత్యక్రియలు ముగిశాయి.

Updated Date - 2023-09-25T01:10:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!