ఐశ్వర్యను అన్‌ఫాలో చేసిన అమితాబ్‌?

ABN , First Publish Date - 2023-12-11T03:59:56+05:30 IST

బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌బచ్చన్‌ తన కోడలు ఐశ్వర్యారాయ్‌ను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారన్న వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది...

ఐశ్వర్యను అన్‌ఫాలో చేసిన అమితాబ్‌?

బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌బచ్చన్‌ తన కోడలు ఐశ్వర్యారాయ్‌ను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారన్న వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. అభిషేక్‌బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ దంపతులు విడాకులు తీసుకున్నారనే వార్త కొన్నాళ్లుగా బాలీవుడ్‌ మీడియాలో వినిపిస్తోంది. ఈ కారణంతోనే ఐశ్వర్యను అమితాబ్‌ అన్‌ఫాలో చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. గతంలో కొంతమంది సినీ జంటలు విడిపోయిన సందర్భాల్లో ఇలా సోషల్‌ మీడియాలో అన్‌ఫాలో అయిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. అయితే ఇన్‌స్టా అకౌంట్స్‌ సెట్టింగ్స్‌ కారణంగా అమితాబ్‌బచ్చన్‌ ఎవరెవరిని ఫాలో అవుతున్నారనేది బహిరంగంగా తెలియకపోవచ్చని కొందరు చెబుతున్నారు. అమితాబ్‌ మనవడు అగస్త్య నంద నటించిన ‘ది ఆర్చీస్‌’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ముంబైలో జరిగిన ప్రీమియర్‌కు బచ్చన్‌ కుటుంబం అంతా కలిసి హాజరైంది. అక్కడ అమితాబ్‌, ఐశ్వర్య కలసి ఫొటోలకు పోజులివ్వడం విశేషం.

Updated Date - 2023-12-11T04:00:00+05:30 IST