సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘అమిగోస్‌’ స్నేహ గీతం

ABN, First Publish Date - 2023-01-21T05:49:55+05:30

నందమూరి కల్యాణ్‌ రామ్‌ మూడు విభినమైన పాత్రల్లో కనిపించబోతున్న చిత్రం ‘అమిగోస్‌’. ఆషికా రంగనాథ్‌ కథానాయిక...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి కల్యాణ్‌ రామ్‌ మూడు విభినమైన పాత్రల్లో కనిపించబోతున్న చిత్రం ‘అమిగోస్‌’. ఆషికా రంగనాథ్‌ కథానాయిక. రాజేంద్రరెడ్డి దర్శకుడు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. శుక్రవారం ‘యెక యెక’ అనే గీతాన్ని ఆవిష్కరించారు. రామజోగయ్య శాస్ర్తి రచించిన గీతమిది. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. జిబ్రాన్‌ స్వరాలు అందించారు. మంజునాథ్‌, సిద్దార్థ్‌, మైఖెల్‌ల కథ ఇది. ముగ్గురూ ఒకేలా ఉంటారు. ఈ ముగ్గురి మైత్రిని ఆవిష్కరించే గీతమిది. గోవా పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించారు. ‘‘ఓ వైవిధ్యభరితమైన ప్రయత్నం ఇది. కల్యాణ్‌ రామ్‌ గెటప్పులూ, ఆయా పాత్రలు ప్రవర్తించే విధానం ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పటి వరకూ విడుదల చేసిన పాటలకూ, ప్రచార చిత్రాలకూ మంచి స్పందన వచ్చింద’’న్నారు దర్శక నిర్మాతలు.

Updated Date - 2023-01-21T05:49:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!