కాన్సెప్ట్‌తో పాటు కమర్షియల్ విలువలూ చూపించాం
ABN , First Publish Date - 2023-07-05T02:51:51+05:30 IST
‘మాయ’ సినిమా విడుదలైన తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేశా. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకు ఎక్కించాం. ఓ వంద మందిని విధి ఓ సర్కిల్‌లోకి తీసుకువచ్చి, వారి జీవితాలను ఎలా అల్లకల్లోలం...
‘మాయ’ సినిమా విడుదలైన తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేశా. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకు ఎక్కించాం. ఓ వంద మందిని విధి ఓ సర్కిల్‌లోకి తీసుకువచ్చి, వారి జీవితాలను ఎలా అల్లకల్లోలం చేసిందో థీమ్‌గా తీసుకున్నాం. ఇది రొమాంటిక్ , క్రైమ్ థ్రిల్లర్‌కాదు.. ఎమోషనల్ థ్రిల్లర్’ అని చెప్పారు దర్శకుడు నీలకంఠ. ఆయన దర్శకత్వంలో ఆరా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ‘సర్కిల్’ చిత్రం ఈ నెల ఏడున విడుదల కానుంది. ఈ సందర్భంగా నీలకంఠ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు.
ఈ చిత్రంలో సాయిరోనక్ ఫొటోగ్రాఫర్‌గా కనిపిస్తాడు. ఇన్ హ్యూమన్ సర్కిల్‌లోకి అతను ప్రవేశించడంతో కథ మొదలవుతుంది. రొమాంటిక్ యాంగిల్ కూడా జత చేశాం. హీరోయిన్లు అర్దిన్ మెహతా, రిచా పనై, నైనాలవి ప్రాధాన్యం కలిగిన పాత్రలు. నా గత సినిమాల్లో లాగా ఇందులోనూ హీరోయిన్ల పాత్రలు కీలకం. వాళ్ల లైఫ్ వాళ్లే డిసైడ్ చేసుకుని ముందుకు సాగే పాత్రలివి. ముగ్గురు హీరోయిన్లతో లవ్ ట్రాక్ కంటే లైఫ్ ట్రాక్ నే తెరపై చూపించాం.
బాబా భాస్కర్ కొరియోగ్రాఫర్‌గానే అందరికీ తెలుసు. తొలిసారిగా ఆయన కామెడీ టచ్ కలిగిన విలన్‌గా ఇందులో నటించి మెప్పించారు. ఈ పాత్రను చేయడానికి ఆయన ముందు సందేహించారు. నేను కన్విన్స్ చేస్తే ఒప్పుకొన్నారు. ఎవరూ ఊహించని విధంగా ఆ పాత్ర ఉంటుంది.
నా సినిమాలు అన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా ఉంటాయి. స్టార్ హీరోలతో చేయకూడదని అనుకోలేదు కానీ కాన్సెప్ట్ మీదే ఎక్కువ వర్క్ చేశా. కుదిరితే ఇకపై స్టార్స్‌తో కూడా చేస్తా. ‘మాయ’ తర్వాత రెండు ప్రాజెక్టులకు సైన్ చేశా. అనుకోని కారణాల వల్ల అవి ఆగిపోయాయి. ఆ తర్వాత మలయాళంలో ఒక సినిమా చేశా. అందుకే తెలుగులో ఇంత గ్యాప్ వచ్చింది.
వెంకటేశ్‌తో ‘స్వామి వివేకానంద’ టీవీ సిరీస్ ప్లాన్ చేశాం. వెంకటేశ్ ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపించారు. కానీ అది టేకాఫ్ కాలేదు. ఆ తర్వాత ఆయనతో ‘ఈనాడు’ సినిమా చేశా.
ఫ అవార్డుల గురించి ఆలోచన నాకు లేదు. ఆడియన్స్ మెచ్చుకుంటే అదే పెద్ద అవార్డ్. ఆడియన్స్ సినిమా చూసే విదానంలో మార్పు వచ్చింది. కొత్తగా తీసిన సినిమాను తప్పకుండా ఆదరిస్తారు. అలాగే కాన్సెప్ట్‌తో పాటు కమర్షియల్ విలువలు కలిగిన ‘సర్కిల్’ను కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ సినిమా తర్వాత వెబ్ సిరీస్ చేయాలని అనుకుంటున్నాను. రెండు కాన్సెప్ట్‌లు రెడీగా ఉన్నాయి.