1990 నేపథ్యంలో...

ABN , First Publish Date - 2023-06-30T23:54:01+05:30 IST

అల్లరి నరే శ్‌ హీరోగా రూపొందుతున్న 62వ చిత్రం ఖరారైంది. శుక్రవారం నరేశ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో ఈ విషయాన్ని తెలిపారు.

1990 నేపథ్యంలో...

అల్లరి నరే శ్‌ హీరోగా రూపొందుతున్న 62వ చిత్రం ఖరారైంది. శుక్రవారం నరేశ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో ఈ విషయాన్ని తెలిపారు. ‘సోలో బతుకే సో బెటర్‌’ ఫేమ్‌ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్‌ బేనర్‌పై రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ‘ఇది హీరో భావోద్వేగ ప్రయాణంలో సాగే కథ, 1990 నేపథ్యంలో ఉంటుంది. లవ్‌, ఎమోషన్‌, యాక్షన్‌, డ్రామా అంశాల కలబోతగా రూపొందుతోంద’ని నిర్మాతలు తెలిపారు. కథ కొత్తగా ఉండడంతో పాటు నరేశ్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది, సెప్టెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం. నాథన్‌.

Updated Date - 2023-06-30T23:54:06+05:30 IST