All scripts are locked : అన్నీ స్ర్కిప్టు లాక్‌ అయ్యాకే...!

ABN , First Publish Date - 2023-06-14T04:10:16+05:30 IST

ప్రస్తుతం ‘గుంటూరు కారం’ రుచి చూపించే పనిలో ఉన్నారు మహేశ్‌బాబు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. షూటింగ్‌ జరుగుతోంది. ఆ తరవాత రాజమౌళితో చేతులు కలుపుతారు. మహేశ్‌ - రాజమౌళి కాంబో ఎప్పుడు మొదలవుతుందా? అని దేశమంతా...

All scripts are locked : అన్నీ స్ర్కిప్టు లాక్‌ అయ్యాకే...!

ప్రస్తుతం ‘గుంటూరు కారం’ రుచి చూపించే పనిలో ఉన్నారు మహేశ్‌బాబు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. షూటింగ్‌ జరుగుతోంది. ఆ తరవాత రాజమౌళితో చేతులు కలుపుతారు. మహేశ్‌ - రాజమౌళి కాంబో ఎప్పుడు మొదలవుతుందా? అని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’తో రాజమౌళి పాన్‌ వరల్డ్‌ దర్శకుడు అయిపోయారు. మహేశ్‌తో చేసే సినిమా హాలీవుడ్‌ స్థాయిలో ఉంటుందన్నది అందరి అంచనా. అందుకే ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా, ఆసక్తిగా అటువైపు ఓ లుక్కేస్తున్నారు. ఆగస్టు 9.. మహేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి క్లాప్‌ కొడతారని ప్రచారం జరుగుతోంది. మహేశ్‌ అభిమానులు కూడా ఇదే నిజమని భావిస్తున్నారు. అయితే జక్కన్న ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన స్ర్కిప్టుపై కసరత్తులు చేస్తున్నారు. ఆ పని ఓ కొలిక్కి వచ్చేంత వరకూ క్లాప్‌ కొట్టకూడదని భావిస్తున్నార్ట. స్ర్కిప్టు లాక్‌ అయ్యాక, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేస్తారు. అవన్నీ సెట్‌ అయిన తరవాతే.. క్లాప్‌ కొడతార్ట. ఒక్కసారి ఈ సినిమాని అధికారికంగా మొదలెట్టాక ఇక నాన్‌ స్టాప్‌గా షూటింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు.

Updated Date - 2023-06-14T04:10:16+05:30 IST