అల్బెలా... అదిరేలా!
ABN , First Publish Date - 2023-04-10T01:08:15+05:30 IST
అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకుడు. మిర్నా కథానాయిక. మే 5న విడుదల చేస్తున్నారు. ఆదివారం ‘అల్బెలా.. అల్బెలా’ అనే గీతాన్ని...
అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకుడు. మిర్నా కథానాయిక. మే 5న విడుదల చేస్తున్నారు. ఆదివారం ‘అల్బెలా.. అల్బెలా’ అనే గీతాన్ని ప్రముఖ కథానాయకుడు నాని ఆవిష్కరించారు. భాస్కరభట్ల రవికుమార్ రాసిన పాట ఇది. రేవంత్, శ్రావణ భార్గవి ఆలపించారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చారు. ఈ సందర్భంగా నిర్మాతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది మాట్లాడుతూ ‘‘నరేశ్‌కి ఇది మరో కొత్త తరహా చిత్రం. ఆయన పాత్ర, నటన ఆకట్టుకొంటాయి. ‘అల్బెలా..’ పాట హీరో, హీరోయిన్ల అనుబంధానికి, వాళ్ల ఆనందకరమైన జీవితానికి అద్దం పడుతుంది. తెరకెక్కించిన తీరు కూడా చాలా హాయిగా ఉంటుంద’’న్నారు.