అక్షయ్‌కుమార్ ఇక భారతీయుడే!
ABN , First Publish Date - 2023-08-16T03:14:51+05:30 IST
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది, కెనడా దేశ పౌరుడిగా ఉంటూ హిందీ చిత్రాల్లో నటిస్తున్నందుకు సంవత్సరాలుగా సోషల్ మీడియా ఆయన్ని...

బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది, కెనడా దేశ పౌరుడిగా ఉంటూ హిందీ చిత్రాల్లో నటిస్తున్నందుకు సంవత్సరాలుగా సోషల్ మీడియా ఆయన్ని ఓ ఆట ఆడుకుంటోంది. ఇక్కడ ఓటు హక్కు లేని అతను ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని పిలుపు ఇవ్వడం కూడా విమర్శలకు కారణమైంది. ‘కెనడ పౌరసత్యం గురించి నేను ఎప్పుడూ దాయలేదు. కానీ భారతదేశం నాకు అన్నీ ఇచ్చింది. నేను సంపాదించింది, పొందింది అంతా ఇక్కడే’ అని చాలా సార్లు అక్షయ్ చెప్పారు కూడా. కెనడా పాస్‌పోర్ట్‌తో ఇండియాలో ఉంటున్న అక్షయ్‌కుమార్ 2019లో ఇండియన్ పాస్‌పోర్ట్ కోసం అప్లయి చేశారు. ఎప్పుడో రావాల్సింది కానీ కొవిడ్ కారణంగా ప్రొసెసింగ్ డిలే అయింది. తనకు పౌరసత్వం లభించిన విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసి ‘నా మనసు.. పౌరసత్వం.. అంతా హిందుస్థానీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే’ అని పేర్కొన్నారు అక్షయ్. ఇటీవల ఆయన నటించిన ‘ఓఎంజీ’ చిత్రం విడుదలై నాలుగు రోజుల్లో రూ.50 కోట్లు వసూలు చేసింది.