కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అకీరాకు హీరో అవ్వాలని లేదు

ABN, First Publish Date - 2023-08-23T02:11:18+05:30

పవన్‌ కల్యాణ్‌ - రేణూదేశాయ్‌ల తనయుడు అకీరానందన్‌ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అకీరా నందన్‌తో దిగిన ఫొటోను దర్శకుడు రాఘవేంద్రరావు సోషల్‌ మీడియాలో...

పవన్‌ కల్యాణ్‌ - రేణూదేశాయ్‌ల తనయుడు అకీరానందన్‌ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అకీరా నందన్‌తో దిగిన ఫొటోను దర్శకుడు రాఘవేంద్రరావు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడమే దీనికి కారణం. నా మనమడు కార్తికేయ, అకిరా నందన్‌ అమెరికాలోని ఫిల్మ్‌ స్కూల్లో చేరారు అని ఆయన ఎక్స్‌లో తెలిపిన కొద్ది సేపట్లోనే ‘అకీరాను వెండితెరపైన చూడబోతున్నాం’ అంటూ పవన్‌ కల్యాణ్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో హడావిడి చేశారు. దీన్ని రేణూదేశాయ్‌ ఖండించారు. మా అబ్బాయి అకీరాకు ఇప్పటివరకూ నటనపై ఆసక్తి లేదన్నారు. తను హీరో అవ్వాలని అనుకోవడం లేదని చెప్పారు. అలాంటిదేమైనా ఉంటే నేనే స్వయంగా మీతో (అభిమానులు) చెబుతాను అని రేణూదేశాయ్‌ తెలిపారు. ఏదైనా పోస్ట్‌ చేసిన వెంటనే ఇలాంటి ఊహాగానాలు చేయడం ఆపేయాలని రేణూదేశాయ్‌ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు సూచించారు. తాను పెట్టిన ఫొటోను, ట్వీట్‌ను రాఘవేంద్రరావు కొద్దిసేపటి తర్వాత తొలగించారు.

Updated Date - 2023-08-23T02:11:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!