అఖిల్ ధీరత్వం
ABN , First Publish Date - 2023-05-10T00:47:06+05:30 IST
అక్కినేని ఇంటి నుంచి వచ్చిన మరో హీరో... అఖిల్. తొలి అడుగుల్లోనే మాస్ హీరో అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా వచ్చిన ‘ఏజెంట్’ పూర్తిగా నిరాశ పరిచింది...

అక్కినేని ఇంటి నుంచి వచ్చిన మరో హీరో... అఖిల్. తొలి అడుగుల్లోనే మాస్ హీరో అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా వచ్చిన ‘ఏజెంట్’ పూర్తిగా నిరాశ పరిచింది. అప్పటి నుంచి అఖిల్ తరువాతి సినిమా ఏమిటి? ఎప్పుడు? అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పుడు అందుకు సంబంధించిన అప్‌డేట్స్ ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. అఖిల్ తన తదుపరి చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌లో చేయబోతున్నట్టు టాక్. అనిల్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని సమాచారం. మాస్, ఫాంటసీ అంశాలతో సాగే కథ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘ధీర’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుంది. ‘విరూపాక్ష’తో ఆకట్టుకొన్న కార్తీక్ దండు కూడా అఖిల్‌కి ఓ కథ చెప్పినట్టు సమాచారం. వీటిపై కూడా అఖిల్ నుంచి క్లారిటీ రావాల్సివుంది.