Akasam daṭi vastava : ఆకాశమంత ప్రేమ
ABN , First Publish Date - 2023-08-04T23:58:01+05:30 IST
కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. కార్తీక మురళీధరన్ కథానాయిక. శశి కుమార్ దర్శకుడు. హర్షిత్, హన్షిత నిర్మాతలు. శుక్రవారం టీజర్ విడుదలైంది.

కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. కార్తీక మురళీధరన్ కథానాయిక. శశి కుమార్ దర్శకుడు. హర్షిత్, హన్షిత నిర్మాతలు. శుక్రవారం టీజర్ విడుదలైంది. 72 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌లో హీరో, హీరోయిన్ల సంభాషణలు, వాళ్ల కెమిస్ర్టీ ఆకట్టుకొంటోంది. ఓ సరికొత్త ప్రేమకథ చెప్పబోతున్నారన్న విషయం ఈ టీజర్‌తోనే అర్థమైంది. ‘బలగం’ లాంటి మంచి సినిమా తరవాత దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై వస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాతోనే గాయకుడు కార్తీక్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘‘ఇదో చక్కటి ప్రేమకథ. ఇంటిల్లిపాదికీ నచ్చేలా ఉంటుంది. టీమ్ అంతా కొత్తవారే. వాళ్లందరికీ ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందన్న నమ్మకం ఉంద’’న్నారు నిర్మాతలు. కెమెరామెన్: ర్యాంపీ నందిగాం.