ఏజెంట్‌ రొమాన్స్‌

ABN , First Publish Date - 2023-03-26T00:47:59+05:30 IST

అఖిల్‌ అక్కినేని హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’. సాక్షి వైద్య కథానాయిక. అఖిల్‌ రా ఏజెంట్‌ పాత్రలో కనిపించనున్నారు...

ఏజెంట్‌ రొమాన్స్‌

అఖిల్‌ అక్కినేని హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’. సాక్షి వైద్య కథానాయిక. అఖిల్‌ రా ఏజెంట్‌ పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్‌ 28న విడుదలవుతోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ‘ఏందే ఏందే’ అంటూ సాగే రొమాంటిక్‌ గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. చంద్రబోస్‌ సాహిత్యం అదించారు. హిప్‌ హాప్‌ తమిళ స్వరాలు సమకూర్చడంతో పాటు, సంజితా హెగ్డే, పద్మలతతో కలసి ఆలపించారు. మమ్ముట్టి కీలకపాత్రపోషిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సినిమాటోగ్రఫీ: రసూల్‌ ఎల్లోర్‌

Updated Date - 2023-03-26T00:48:01+05:30 IST