ఏజెంట్ అన్ని హంగులతో వస్తున్నాడు
ABN , First Publish Date - 2023-04-24T00:37:39+05:30 IST
‘‘ఒక సినిమా బ్లాక్‌బస్టర్ అవడానికి ఏమేం ఉండాలో అవన్నీ ‘ఏజెంట్’ చిత్రంలో ఉన్నాయి.

‘‘ఒక సినిమా బ్లాక్‌బస్టర్ అవడానికి ఏమేం ఉండాలో అవన్నీ ‘ఏజెంట్’ చిత్రంలో ఉన్నాయి. మమ్ముట్టి గారు ఈ సినిమా అంగీకరించారని తెలియగానే అఖిల్‌కు పెద్ద హిట్ పడుతుందనుకున్నాను’ అని నాగార్జున అన్నారు.
అఖిల్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఏజెంట్’ చిత్రం ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం వరంగల్‌లో చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. నాగార్జున మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం అఖిల్ పడిన కష్టం ప్రతిరోజూ చూశాను. ఆ ఎనర్జీని సురేందర్ రెడ్డి సినిమాలో పెట్టారు. అనిల్ సుంకర ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. కొత్త జానర్‌లో వస్తున్న ‘ఏజెంట్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు హిట్ చేస్తారనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. అఖిల్ మాట్లాడుతూ ‘‘ఏజెంట్’ రెండేళ్ల కష్టం. క్రేజీగా చేశాం. ఇంత కంటే గొప్పగా ఇంకా ఏం చేయాలా అనిపిస్తోంది. ‘ఏజెంట్’ నాపైన నాకు నమ్మకం ఇచ్చింది. అనిల్‌గారు లేకపోతే ఇంత మంచి సినిమా వచ్చేది కాదు. మమ్ముట్టి లాంటి లెజండ్‌తో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా’ అన్నారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ‘అఖిల్ కోసమే ఈ సినిమా చేశాను. ఆయన కసి తో ఈ సినిమా చేశారు’ అని చెప్పారు.