అఖిల్‌ను మరో మెట్టు ఎక్కిస్తుంది
ABN , First Publish Date - 2023-04-27T00:19:15+05:30 IST
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సాక్షి వైద్య కథానాయిక. అనిల్ సుంకర నిర్మాత. ఈ నెల 28న విడుదలవుతున్న సందర్భంగా ఆయన ‘ఏజెంట్’ విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సాక్షి వైద్య కథానాయిక. అనిల్ సుంకర నిర్మాత. ఈ నెల 28న విడుదలవుతున్న సందర్భంగా ఆయన ‘ఏజెంట్’ విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
‘ఏజెంట్’ అఖిల్ అక్కినేనిని హీరోగా మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుంది. ‘ఏజెంట్’కు ముందు, తర్వాత అనే స్థాయిలో అఖిల్ కెరీర్ మారుతుంది. ఆయన పాత్రలో ఫన్ ఉంటుంది. ప్రతిదీ ఎంజాయ్ చేస్తుంటాడు.
గొప్ప సినిమా చూసిన అనుభూతిని ప్రేక్షకులకు ఇస్తుంది ‘ఏజెంట్’. యాక్షన్ ప్రధానంగా సాగుతుంది. ముగ్గురు రా ఏజెంట్ల మధ్య నడుస్తుంది. కథనం చాలా కొత్తగా ఉంటుంది. బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. విజువల్స్ గ్రాండ్‌గా ఉంటాయి.
‘ఏజెంట్’ భారీ స్పాన్ ఉన్న సినిమా. విదేశాల్లో చిత్రీకరణ వల్ల ఎక్కువ టైం తీసుకుంది. మళ్లీ మార్పులు చేయాల్సిన అవసరం రాకుండా పకడ్బంధీగా రంగంలోకి దిగాం. గంటన్నర పాటు సీజీ వర్క్ ఉంది. రిలీజ్ డేట్‌కు రెడీ చేయడానికి రేయింబవళ్లు కష్టపడ్డాం.
ఫ బడ్జెట్ గురించి మాట్లాడే రోజులు పోయాయి. ఇప్పుడు కంటెంట్ బాగుంటే చాలు, వసూళ్లు అవే వస్తాయి. పైగా తెలుగు సినిమాకి రాన్రానూ మార్కెట్ పెరుగుతోంది. కాబట్టి, ఎంత ఖర్చుపెట్టినా రాబట్టుకోవచ్చనే నమ్మకం ఏర్పడింది. ‘ఏజెంట్’ చిత్రాన్ని ఏ స్థాయిలో తీయాలి, ఎంత ఖర్చు చేయాలనే విషయంలో మొదట్నుంచి స్పష్టతతో ఉన్నాం కాబట్టి గీత దాటలేదు.
ఫ కథ నచ్చి సురేందర్ రెడ్డి కూడా నిర్మాణంలో భాగస్వామినవుతాను అన్నారు. త్వరలో దర్శకత్వం చేస్తాను. ఆ సినిమా స్పై జానర్‌లో ఉంటుంది.