మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ...!

ABN , First Publish Date - 2023-10-26T01:54:24+05:30 IST

మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ తన సన్నిహిత మిత్రుడు అమితాబ్‌ బచ్చన్‌తో కలసి నటిస్తున్నారు రజనీకాంత్‌, ‘జైలర్‌’ చిత్రం తర్వాత లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ రజనీకాంత్‌తో నిర్మిస్తున్న చిత్రం ఇది...

మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ...!

‘హమ్‌’ చిత్రంలో అమితాబ్‌, రజినీకాంత్‌

మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ తన సన్నిహిత మిత్రుడు అమితాబ్‌ బచ్చన్‌తో కలసి నటిస్తున్నారు రజనీకాంత్‌, ‘జైలర్‌’ చిత్రం తర్వాత లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ రజనీకాంత్‌తో నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌తో కలసి ఆయన స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవడం విశేషం. అందుకే ఆనందం పట్టలేక అమితాబ్‌తో కలసి దిగిన ఓ ఫొటోని ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘33 ఏళ్ల తర్వాత నా మార్గదర్శి, అద్భుతమైన వ్యక్తి అమితాబ్‌తో కలసి నటిస్తున్నాను. నా ఆనందానికి అవధులు లేవు’ అంటూ భావోద్వేగంతో పోస్ట్‌ చేశారు రజనీకాంత్‌. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు లెజండరీ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడడం నిజంగా అభిమానులకు ఆనందమే! అమితాబ్‌, రజనీకాంత్‌ ఇంతకుముందు ‘అంథా కానూన్‌’, ‘గిరాఫ్తార్‌’ వంటి చిత్రాల్లో నటించారు. 1991లో వచ్చిన ‘హమ్‌’ సినిమా తర్వాత వీరు మళ్లీ కలసి నటించలేదు. ‘జై భీమ్‌’ చిత్ర దర్శకుడు టి.జె. జ్ఞానవేల్‌ మళ్లీ ఓ వపర్‌పుల్‌ కథాంశంతో రూపొందిస్తున్న ఈ సినిమాలో రానా, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - 2023-10-26T01:54:24+05:30 IST