పద్నాలుగేళ్ల తర్వాత మళ్లీ..

ABN , First Publish Date - 2023-02-01T23:14:50+05:30 IST

అమితాబ్‌- రేఖ, కమల్‌హాసన్‌- శ్రీదేవి, షారుఖ్‌ ఖాన్‌ - కాజోల్‌.. ప్రేక్షకులను అలరించిన సినీ జంటలు ఇవి. ఈ జాబితాలో తమిళ హీరో విజయ్‌, త్రిష పేర్లను...

పద్నాలుగేళ్ల తర్వాత మళ్లీ..

అమితాబ్‌- రేఖ, కమల్‌హాసన్‌- శ్రీదేవి, షారుఖ్‌ ఖాన్‌ - కాజోల్‌.. ప్రేక్షకులను అలరించిన సినీ జంటలు ఇవి. ఈ జాబితాలో తమిళ హీరో విజయ్‌, త్రిష పేర్లను కూడా చేర్చాలి. తమిళ ప్రేక్షకుల్ని ఎంతో అలరించిన ఈ జంట 2006లో వచ్చిన ‘అది’ సినిమా తర్వాత ఎందుకనో మళ్లీ కలసి నటించలేదు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలసి నటిస్తుండడం అభిమానులకు ఆనందం కలిగించే వార్తే. విజయ్‌ సరసన త్రిష నటించనున్నారంటూ కొన్ని వారాలుగా తమిళ నాట వినిపిస్తున్నప్పటికీ ఆమె ఈ విషయం మీద నోరు మెదపలేదు. విజయ్‌ నటిస్తున్న 67వ చిత్రం కోసం యూనిట్‌ మంగళవారం బయలుదేరి, కశ్మీర్‌ వెళ్లింది. వాళ్లలో త్రిష కూడా ఉండడం గమనార్హం. ఈ విషయాన్నే చిత్ర నిర్మాణ సంస్థ సెవన్‌ స్ర్కీన్‌ స్టూడియో బుధవారం సోషల్‌ మీడియా వేదికగా ధ్రువీకరించింది. విజయ్‌, త్రిష కాంబినేషన్‌లో వస్తున్న ఐదో సినిమా ఇది. ఈ చిత్రానికి లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Updated Date - 2023-02-01T23:14:52+05:30 IST