Mangalavaram : భయం... భయంగా

ABN , First Publish Date - 2023-07-05T02:58:32+05:30 IST

‘ఆర్‌.ఎక్స్‌ 100’తో తన బాణీ చూపించిన దర్శకుడు అజయ్‌ భూపతి. ‘మహా సముద్రం’ నిరాశ పరిచినా అక్కడా తనదైన మార్క్‌ కనిపించింది. ఇప్పుడు ‘మంగళవారం’తో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు...

Mangalavaram : భయం... భయంగా

‘ఆర్‌.ఎక్స్‌ 100’తో తన బాణీ చూపించిన దర్శకుడు అజయ్‌ భూపతి. ‘మహా సముద్రం’ నిరాశ పరిచినా అక్కడా తనదైన మార్క్‌ కనిపించింది. ఇప్పుడు ‘మంగళవారం’తో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. స్వాతి రెడ్డి గునుపాటి, సురేశ్‌ వర్మ నిర్మాతలు. మంగళవారం టీజర్‌ విడుదల చేశారు. టీజర్‌ ఆధ్యంతం భయపెట్టింది. అజనీష్‌ లోక్‌నాథ్‌ అందించిన నేపథ్య సంగీతం మరింత థ్రిల్‌ కలిగించేలా ఉంది. ‘‘అజయ్‌ భూపతిలోని మరో కోణం ఆవిష్కరించే చిత్రమిది. షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’ని నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-07-05T02:58:32+05:30 IST