క్వాంటమ్‌ సామ్రాజ్యంలో సాహసాలు

ABN , First Publish Date - 2023-02-14T03:06:31+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా పిల్లల్ని, పెద్దలను అలరిస్తోన్న మార్వెల్‌ కామిక్స్‌ ఈసారి ‘యాంట్‌-మేన్‌ అండ్‌ ద వాస్ప్‌:ద క్వాంటమేనియా’ పేరుతో...

క్వాంటమ్‌ సామ్రాజ్యంలో సాహసాలు

ప్రపంచవ్యాప్తంగా పిల్లల్ని, పెద్దలను అలరిస్తోన్న మార్వెల్‌ కామిక్స్‌ ఈసారి ‘యాంట్‌-మేన్‌ అండ్‌ ద వాస్ప్‌:ద క్వాంటమేనియా’ పేరుతో ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. పాల్‌ రూడ్‌, ఎవాంజలిన్‌ లిల్లీ, మిచెల్‌ పిఫర్‌ మైఖేల్‌ డగ్లాస్‌ ప్రధాన పాత్రలు పోషించారు. సూపర్‌ హీరోస్‌ స్కాట్‌ లాంట్‌, హోప్‌ వాన్‌ డైన్‌ మరోసారి యాంట్‌ మేన్‌, ద వాస్ప్‌గా అలరించనున్నారు. క్వాంటమ్‌ సామ్రాజ్యంలో సాహసాలను దర్శకుడు పేటన్‌ రీడ్‌ తనదైన శైలిలో తెరకెక్కించారు. కెవీన్‌ ఫీగే, స్టీఫెన్‌ బ్రౌసార్ట్‌ నిర్మించారు. ప్రీమియర్‌ చూసిన ప్రేక్షకులు సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారని చిత్రబృందం పేర్కొంది. తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది.

Updated Date - 2023-02-14T03:06:31+05:30 IST