కొత్తతేదీన ఆదికేశవ ఆగమనం

ABN , First Publish Date - 2023-11-02T02:51:35+05:30 IST

పంజా వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా రూపొందిన ‘ఆదికేశవ’ చిత్రం కొత్త రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. ఈ నెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో...

కొత్తతేదీన ఆదికేశవ ఆగమనం

పంజా వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా రూపొందిన ‘ఆదికేశవ’ చిత్రం కొత్త రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. ఈ నెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయాన్ని తెలిపారు. ‘ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్‌ వరల్డ్‌క్‌పలో భారత్‌ వరుస విజయాలతో దూసుకుపోతోంది. దీంతో ప్రేక్షకుల ఆసక్తి క్రికెట్‌పైనే ఎక్కువగా ఉంది. భారత్‌ మ్యాచ్‌లు ఉన్న సమయంలో థియేటర్ల దగ్గర రద్దీ కనిపించడం లేదు. అందుకే ముందు ప్రకటించిన విధంగా ఈ నెల 10న ‘ఆదికేశవ’ చిత్రాన్ని విడుదల చేయడం లేదు. దానికి బదులుగా ఈ నెల 24న ఈ సినిమాను విడుదల చేస్తున్నా’మని నాగవంశీ పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్లతో చర్చించిన తర్వాత కొత్తతే దీని నిర్ణయించామనీ, ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్‌, యూత్‌ ఆడియన్స్‌కు ‘ఆదికేశవ’ నచ్చుతుందని దర్శకుడు శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి తెలిపారు. మాస్‌, యాక్షన్‌ జానర్‌లో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక. జోజూ జార్జ్‌, అపర్ణాదాస్‌ కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు.

Updated Date - 2023-11-02T02:51:35+05:30 IST