అడుగో మానస్‌!

ABN , First Publish Date - 2023-08-31T02:39:15+05:30 IST

విక్టరీ వెంకటేశ్‌ 75వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఎనిమిది కీలక పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది...

అడుగో మానస్‌!

విక్టరీ వెంకటేశ్‌ 75వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఎనిమిది కీలక పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. ఇప్పటి వరకూ ఏడు పాత్రలను పరిచయం చేశారు. ఎనిమిదో పాత్ర మాన్‌సకు సంబంధించిన గెటప్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ పాత్రను కోలీవుడ్‌ స్టార్‌ ఆర్య పోషిస్తున్నారు. ఫార్మల్‌ దుస్తుల్లో, చేతిలో మెషిన్‌గన్‌తో నడుచుకుంటూ వెళుతున్న ఆర్య లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో నవాజుద్దీన్‌ సిద్దిఖి, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, ఆండ్రియా, సారా, జయప్రకాశ్‌ తదితరులు నటిస్తున్నారు. అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా డిసెంబర్‌ 22న క్రిస్మస్‌ సందర్భంగా ‘సైంధవ్‌’ విడుదల కానుంది.

Updated Date - 2023-08-31T02:39:15+05:30 IST