G2: ఆసక్తికరంగా అడివి శేష్ ఫస్ట్ లుక్

ABN , First Publish Date - 2023-01-09T18:34:51+05:30 IST

HIT-2తో మంచి విజయం అందుకున్న అడవి శేష్ (Adivi Sesh).. తదుపరి చేస్తున్న చిత్రం ‘G2’. తను నటించిన గూఢచారి (Goodhachari)‌కి సీక్వెల్‌గా ఈ చిత్రం

G2: ఆసక్తికరంగా అడివి శేష్ ఫస్ట్ లుక్
G2 First Look

HIT-2తో మంచి విజయం అందుకున్న అడవి శేష్ (Adivi Sesh).. తదుపరి చేస్తున్న చిత్రం ‘G2’. తను నటించిన గూఢచారి (Goodhachari)‌కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. గూఢచారి ఇండియాలో సెట్ చేయగా, G2 ఇంటర్ నేషనల్‌గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కథను శేష్ స్వయంగా అందించడం విశేషం. అడవి శేష్ హీరోగా నటించిన ‘మేజర్’ చిత్రానికి ఎడిటర్‌గా వర్క్ చేసిన వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files), కార్తికేయ 2 (Karthikeya 2), మేజర్ (Major) వంటి ఆల్ ఇండియా హిట్‌ లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌‌లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. (G2 First Look and Pre-Vision)

సోమవారం ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు.. చిత్ర ‘ప్రీ విజన్’ వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో ఫార్మల్ అవుట్ ఫిట్‌లో స్లిక్ అండ్ స్టైలిష్ లుక్‌‌లో ఉన్న శేష్ బిల్డింగ్‌పై నుండి దూకుతూ తుపాకీతో ఒకరిని కాల్చడం కనిపిస్తుంది. ఈ సినిమా కోసం అడివి శేష్ మేకోవర్‌ అయ్యారు. ప్రీ-విజన్ విషయానికి వస్తే, శేష్ ఇండియా నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి చివరి విజువల్స్ చూపించారు. ఆ తర్వాత G2లో అతని ఫస్ట్ లుక్‌ ని ప్రజంట్ చేశారు. 2023లో షూటింగ్‌ ప్రారంభమవుతుందని అనౌన్స్ చేశారు. కథ, మేకింగ్, సాంకేతిక ప్రమాణాలన్నీ ఈ G2‌కు అద్భుతంగా ఉంటాయని మేకర్స్ పేర్కొన్నారు. పోస్టర్, ప్రీ-విజన్‌‌లో కూడా ఇది స్పష్టంగా తెలుస్తోంది. (Goodhachari 2)

Updated Date - 2023-01-09T19:10:35+05:30 IST