ట్రిబెకా ఫెస్టివల్‌లో ఆదిపురుష్‌ ప్రీమియర్‌

ABN , First Publish Date - 2023-04-20T03:39:46+05:30 IST

భారతీయ సంస్కృతి, ఇతిహాసాల గొప్పతనాన్ని చాటుతూ ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ఓం రౌత్‌ రూపొందించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం ప్రీమియర్‌ న్యూయార్క్‌లో జరిగే ట్రిబాకా ఫెస్టివల్‌లో జూన్‌ 13న ఉంటుంది...

ట్రిబెకా ఫెస్టివల్‌లో ఆదిపురుష్‌ ప్రీమియర్‌

భారతీయ సంస్కృతి, ఇతిహాసాల గొప్పతనాన్ని చాటుతూ ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ఓం రౌత్‌ రూపొందించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం ప్రీమియర్‌ న్యూయార్క్‌లో జరిగే ట్రిబాకా ఫెస్టివల్‌లో జూన్‌ 13న ఉంటుంది. భూషణ్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 16న ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

రాబర్ట్‌ డి నీరో, జేన్‌ రోసెంతల్‌, క్రెయిగ్‌ ఫాట్‌కాఫ్‌ తదితరులు కలసి నెలకొల్పిన ‘ఓకెఎక్స్‌’ సంస్థ నిర్వహించే ట్రిబెకా ఫెస్టివల్‌లో కళాకారులు, విభిన్న ప్రేక్షకులు ఒక చోట చేరి, అన్ని రకాల కథలను పంచుకుంటారు. ఇందులో భాగంగా ‘ఆదిపురుష్‌’ 3డీ వెర్షన్‌ను ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్‌ వెల్లడిస్తూ ‘భారతదేశ స్ఫూర్తి ప్రతిధ్వనించే కథ ఇది. ‘ఆదిపురుష్‌’ సినిమా కాదు.. ఒక ఎమోషన్‌, సెంటిమెంట్‌. ఈ చిత్రాన్ని ట్రిబెకా ఫెస్టివల్‌లో ప్రదర్శించాలని నిర్ణయించడం చాలా ఆనందంగా ఉంది. ఈ పెస్టివల్‌లో పాల్గొనాలనేది నా చిరకాల కోరిక’ అన్నారు.

నిర్మాత భూషణ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘ భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మనందరికీ గర్వకారణం. ‘ఆదిపురుష్‌’ చిత్రం కోసం మేమంతా ఎంతో ప్రేమతో పనిచేశాం. ఈ సినిమా విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. ప్రపంచ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుందని కచ్చితంగా నమ్ముతాను’ అన్నారు. ఈ చిత్రంలో కృతి సనన్‌, సైఫ్‌ అలీఖాన్‌ తదితరులు నటించారు.

Updated Date - 2023-04-20T03:39:46+05:30 IST