ఆది కేశవ పోరాటం

ABN , First Publish Date - 2023-05-16T02:06:03+05:30 IST

పంజా వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఎస్‌.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ చిత్రానికి ‘ఆది కేశవ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు..

ఆది కేశవ పోరాటం

పంజా వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఎస్‌.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ చిత్రానికి ‘ఆది కేశవ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. సోమవారం ఫస్ట్‌ లుక్‌తో పాటు యాక్షన్‌ మోడ్‌లో ఉన్న ఫస్ట్‌ గ్లిమ్స్‌ని కూడా విడుదల చేశారు. రుద్ర పాత్రలో వైష్ణవ్‌ తేజ్‌ని ఈ ప్రచార చిత్రాల ద్వారా పరిచయం చేశారు. చిత్రగా శ్రీలీల, వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణాదాస్‌ నటిస్తున్నారు. మలయాళ నటుడు బోజు జార్జ్‌ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. జీవీ.ప్రకాశ్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. జులైలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

Updated Date - 2023-05-16T02:06:03+05:30 IST