విడుదలకు సిద్ధమైన అధర్వ
ABN, First Publish Date - 2023-05-03T01:58:28+05:30
కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన ‘అధర్వ’ చిత్రం జూన్‌లో విడుదల కానుంది. మహేశ్‌రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో...
కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన ‘అధర్వ’ చిత్రం జూన్‌లో విడుదల కానుంది. మహేశ్‌రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాత సుభాష్ నూతలపాటి చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయనీ, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో క్రైమ్ థ్లిల్లర్‌గా సినిమాను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి ఆదరణ లభించిందనీ, సినిమా కూడా అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుందనీ సుభాష్ చెప్పారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని, ఎస్.బి. ఉద్దవ్ ఎడిటింగ్‌ను, చరణ్ మాధవనేని ఫొటోగ్రఫీని అందించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: విజయ, ఝాన్సీ, సమర్పణ: నూతలపాటి నరసింహం, అనసూయమ్మ.