యాక్షన్‌ థ్రిల్లర్‌

ABN , First Publish Date - 2023-08-30T04:45:15+05:30 IST

రక్షిత్‌ అట్లూరి, అపర్షా జనార్థన్‌ , సంకీర్తన విపిన్‌, శత్రు కీలక పాత్రలు పోషించిన ‘సరకాసుర’ చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు....

యాక్షన్‌ థ్రిల్లర్‌

రక్షిత్‌ అట్లూరి, అపర్షా జనార్థన్‌ , సంకీర్తన విపిన్‌, శత్రు కీలక పాత్రలు పోషించిన ‘సరకాసుర’ చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. సెబాస్టియన్‌ దర్శకత్వంలో ఆజ్జా శ్రీనివాస్‌, కారుమూరు రఘు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ రెండో వారంలో విడుదల చేయనున్నారు. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ‘నరకాసుర’ అనే రాక్షసుడి జననం నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అన్ని వర్దాల ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: నవ్‌పాల్‌ రాజా, ఛాయాగ్రహణం: నాని చామిడిశెట్టి, ఎడిటర్‌: సిహెచ్‌ వంశీకృష్ణ.

Updated Date - 2023-08-30T04:45:15+05:30 IST