యాక్షన్‌ ఫీస్ట్‌.. ‘ఘోస్ట్‌’!

ABN , First Publish Date - 2023-10-30T01:17:16+05:30 IST

శివరాజ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఘోస్ట్‌’. అనుపమ్‌ ఖేర్‌, జయరామ్‌ కీలక పాత్రలు పోషించారు...

యాక్షన్‌ ఫీస్ట్‌.. ‘ఘోస్ట్‌’!

శివరాజ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఘోస్ట్‌’. అనుపమ్‌ ఖేర్‌, జయరామ్‌ కీలక పాత్రలు పోషించారు. శ్రీని దర్శకుడు. సందేశ్‌ నాగరాజ్‌ నిర్మాత. నవంబరు 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘యాక్షన్‌ ప్రియులకు ఫీస్ట్‌ లాంటి సినిమా ఇది. దసరా సందర్భంగా కన్నడలో విడుదలై ఘన విజయాన్ని అందుకొంది. తెలుగు ప్రేక్షకులకూ ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. ఇటీవల రాజమౌళి చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింద’’న్నారు.

Updated Date - 2023-10-30T01:17:16+05:30 IST