కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మేకప్‌ లేకుండా నటించా

ABN, First Publish Date - 2023-10-12T03:30:28+05:30

రాఘవ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్రధాన పాత్రలు పోఫించిన హై యాక్షన్‌ డ్రామా ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ దీపావళికి విడుదల కానుంది. కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో కార్తీకేయన్‌ నిర్మించారు...

రాఘవ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్రధాన పాత్రలు పోఫించిన హై యాక్షన్‌ డ్రామా ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ దీపావళికి విడుదల కానుంది. కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో కార్తీకేయన్‌ నిర్మించారు. ఈ సినిమాలోని ‘కోరమీసం’ పాటను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత కార్తికేయన్‌ మాట్లాడుతూ ‘రూ. వంద కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తీశాం. ఓ పండగలా చిత్రం ఉంటుంది. అందుకే దీపావళికి విడుదల చేస్తున్నాం’ అన్నారు. ఈ సినిమాలో లారెన్స్‌ గ్యాంగ్‌స్టర్‌గా, ఎస్‌.జె. సూర్య ఫిల్మ్‌ మేకర్‌గా నటించారనీ, వీరిద్దరి మఽధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయనీ దర్శకుడు చెప్పారు. లారెన్స్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ లో నేను నటించాలి. కానీ కుదరలేదు. అందుకే ఈ సినిమా వదల్లేదు. ఇందులో మేకప్‌ లేకుండా నటించాలంటే మొదట వద్దన్నాను. కానీ స్ర్కీన్‌ మీద చూసుకున్నాక నా మీద నాకు నమ్మకం వచ్చింది. మా నిర్మాత చాలా మంచి వాడు. ఆయన కోసమైనా ఈ సినిమా ఆడాలి’ అన్నారు.

Updated Date - 2023-10-12T03:30:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!