ఓ యువతి విముక్తి పోరాటం
ABN , First Publish Date - 2023-10-29T05:41:45+05:30 IST
కర్ణాటకలోని హళిబేడు ఆలయానికి సమీపంలో ఉన్న ఓ గిరిజన తండాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం ‘శాంతల’. నిర్మాత కె. ఎస్ రామారావు పర్యవేక్షణలో...

కర్ణాటకలోని హళిబేడు ఆలయానికి సమీపంలో ఉన్న ఓ గిరిజన తండాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం ‘శాంతల’. నిర్మాత కె. ఎస్ రామారావు పర్యవేక్షణలో డాక్టర్ యిర్రంకి సురేశ్ నిర్మించారు. ఈ పీరియాడిక్ చిత్రం నవంబర్ 17న విడుదలవుతోంది. ‘ది ఫ్యామిలీమేన్’ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న అశ్లేషాఠాకూర్ టైటిల్ రోల్ పోషించారు. నిహల్ కోదాటి కథానాయకుడు. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ ‘శాంతల’కు సంభాషణలు అందించారు. విశాల్ చంద్రశేఖర్ పాటలను అందించారు. శేషు పెద్దిరెడ్డి దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ భాషల్లో విడుదలవుతుంది. కామాంధుడి బారి నుంచి విముక్తి పొందిన ఓ యువతి కథే ‘శాంతల’ చిత్రానికి ప్రధానమైన కథాంశం అని యూనిట్ తెలిపింది.