ఓ విజేత ప్రయాణం

ABN , First Publish Date - 2023-10-30T01:19:41+05:30 IST

విక్రాంత్‌ రుద్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘అర్జున్‌ చక్రవర్తి’. విజయరామరాజు, సిజా రోజ్‌ కీలక పాత్రలు పోషించారు...

ఓ విజేత ప్రయాణం

విక్రాంత్‌ రుద్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘అర్జున్‌ చక్రవర్తి’. విజయరామరాజు, సిజా రోజ్‌ కీలక పాత్రలు పోషించారు. శ్రీని గుబ్బల నిర్మాత. ఇటీవల ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ‘‘1980లలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఓ కబడ్డీ ఆటగాడి కథ ఇది. తన జీవితంలోని కష్టనష్టాలు, జయాపజయాలు, ఎత్తు పల్లాలు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాం. ఈ సినిమా కోసం అత్యున్నత సాంకేతిక బృందం పని చేస్తోంది. ప్రేక్షకులకు తప్పకుండా ఈ సినిమా ద్వారా స్ఫూర్తి పంచుతాం’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-10-30T01:19:41+05:30 IST