పల్లెటూరి ప్రేమకథ
ABN , First Publish Date - 2023-11-15T00:42:00+05:30 IST
వినాయక్ దేశాయ్, అపర్ణా దేశాయ్ జంటగా రూపుదిద్దుకొంటున్న ప్రేమకథా చిత్రం ‘రాధామాధవం’. దాసరి ఇస్సాకు దర్శకత్వంలో గోనాల్ వెంకటేశ్ నిర్మిస్తున్నారు...

వినాయక్ దేశాయ్, అపర్ణా దేశాయ్ జంటగా రూపుదిద్దుకొంటున్న ప్రేమకథా చిత్రం ‘రాధామాధవం’. దాసరి ఇస్సాకు దర్శకత్వంలో గోనాల్ వెంకటేశ్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలను సైతం ఆదరిస్తారని, అలాగే గ్రామీణ ప్రేమకథతో రూపుదిద్దుకున్న ఈ సినిమా కూడా విజయం సాధించాలని రాజ్ కందుకూరి కోరారు. దర్శకుడు దాసరి ఇస్సాకు మాట్లాడుతూ ‘పల్లెటూరి ప్రేమకథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఆసక్తికరరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. తప్పకుండా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాం’ అన్నారు. ఇది తనకు రెండో సినిమా అనీ, ప్రేక్షకులు ఆదరించాలని హీరో వినాయక్ కోరారు.