విలక్షణ కుటుంబ కథ

ABN , First Publish Date - 2023-03-25T02:51:37+05:30 IST

సుధాకర్‌ కోమాకుల హీరోగా చిన్నా పాపిశెట్టి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఆమని, దేవి ప్రసాద్‌ ముఖ్యపాత్రల్లో నటించారు...

విలక్షణ కుటుంబ కథ

సుధాకర్‌ కోమాకుల హీరోగా చిన్నా పాపిశెట్టి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఆమని, దేవి ప్రసాద్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ను యూనిట్‌ విడుదల చేసింది. ‘నారాయణ అండ్‌ కో’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. ఇదొక విలక్షణమైన కుటుంబం కథ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రాన్ని పాపిశెట్టి బ్రదర్స్‌, సుధాకర్‌ కోమాకుల నిర్మిస్తున్నారు. సంగీతం: సురేశ్‌ బొబ్బిలి. సినిమాటోగ్రఫీ: రాహుల్‌ శ్రీవాత్సవ్‌

Updated Date - 2023-03-25T02:51:38+05:30 IST