ప్రతి పది నిమిషాలకు ఓ ట్విస్ట్
ABN, First Publish Date - 2023-11-29T01:05:36+05:30
కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘అథర్వ’. మహేశ్ రెడ్డి దర్శకుడు. డిసెంబరు 1న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సుభాష్ నూతలపాటి మాట్లాడుతూ...
కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘అథర్వ’. మహేశ్ రెడ్డి దర్శకుడు. డిసెంబరు 1న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సుభాష్ నూతలపాటి మాట్లాడుతూ ‘‘నేను యూకేలో ఎంబీఏ చేశాను. మా నాన్నగారికి సినిమాలంటే ఆసక్తి. ఆయనకు చేదుడు వాదోడుగా నిలిచాను. ఇంతకు ముందు వేరే బ్యానర్‌లో ఓ సినిమా చేశాం. టెక్నికల్‌గా ఇది నా రెండో సినిమా. మహేశ్ రెడ్డి చెప్పిన కథ చాలా నచ్చింది. క్లూస్ టీమ్ గురించి ఇంత డిటైలింగ్‌గా కథ ఎవరూ చెప్పలేదు. అది కొత్త పాయింట్ అవుతుందని భావించాం. కథనం కూడా ఆసక్తికరంగా ఉంది. ప్రతి పది నిమిషాలకూ ఓ ట్విస్ట్ వస్తుంది. ప్రస్తుతం థ్రిల్లర్ చిత్రాల్ని అందరూ ఇష్టపడుతున్నారు. ఈ జోనర్‌లో వస్తున్న మరో మంచి చిత్రమిది. దర్శకుడు మహేశ్ రెడ్డి క్లూస్ టీమ్‌లో పనిచేశారు. ఆయన అనుభవం ఈ సినిమాకి ఉపయోగపడింది. ఇటీవల క్లూస్ టీమ్ కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాం. వాళ్లు సినిమా బాగుందంటూ మెచ్చుకొన్నారు. ప్రేక్షకుల నుంచి కూడా ఇలాంటి స్పందనే వస్తుందన్న నమ్మకం ఉంద’’న్నారు.