దెయ్యానికి చెప్పిన కథ

ABN , First Publish Date - 2023-08-08T03:40:28+05:30 IST

యశ్విన్‌, దినేశ్‌ తేజ్‌, అజయ్‌, బాలాదిత్య కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘కథాకేళి’. శతమానంభవతి ఆర్ట్స్‌ పతాకంపై సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం వహించారు...

దెయ్యానికి చెప్పిన కథ

యశ్విన్‌, దినేశ్‌ తేజ్‌, అజయ్‌, బాలాదిత్య కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘కథాకేళి’. శతమానంభవతి ఆర్ట్స్‌ పతాకంపై సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం వహించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో టైటిల్‌ లోగోని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, టీజర్‌ని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఆవిష్కరించారు. దిల్‌ రాజు మాట్లాడుతూ ‘‘సతీశ్‌ దర్శకత్వం వహించిన ‘శతమానంభవతి’ మా సంస్థకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. అదే పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించడం ఆనందంగా ఉంది. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాల’’ని ఆకాంక్షించారు. ‘‘చాలామంది దెయ్యం కథలు చెప్పారు. దెయ్యానికే కథ చెప్పాల్సివస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఈ సినిమా పుట్టింది. ‘మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కోసం మనమే సినిమా తీసుకోవాలి’ అనే ఈవీవీ సత్యనారాయణ చెప్పిన మాటతోనే ఈ సంస్థని నెలకొల్పా’’ అన్నారు సతీశ్‌ వేగేశ్న.

Updated Date - 2023-08-08T03:40:28+05:30 IST