Surya Teja Aelay: ఇప్పటి వరకూ ఎవరూ చెప్పని కథ‌తో ఎంట్రీ..

ABN , First Publish Date - 2023-10-08T00:41:35+05:30 IST

కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో సూర్యతేజ ఏలే హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘భరతనాట్యం’. పాయల్‌ సరాఫ్‌ నిర్మాత. మీనాక్షి గోస్వామి కథానాయిక. శనివారం హైదరాబాద్‌లో టీజర్‌ విడుదల చేశారు...

Surya Teja Aelay: ఇప్పటి వరకూ ఎవరూ చెప్పని కథ‌తో ఎంట్రీ..

కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో.. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే కుమారుడు సూర్యతేజ ఏలే హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘భరతనాట్యం’. పాయల్‌ సరాఫ్‌ నిర్మాత. మీనాక్షి గోస్వామి కథానాయిక. శనివారం హైదరాబాద్‌లో టీజర్‌ విడుదల చేశారు. సూర్య తేజ మాట్లాడుతూ ‘‘నన్ను నమ్మి ఈ చిత్రాన్ని ఇంత భారీగా రూపొందించిన నిర్మాతకు కృతజ్ఞతలు. ఈ కథలో పాత్రలన్నీ బాగుంటాయి. మలుపులు ఆకట్టుకొంటాయ’’న్నారు. ‘‘క్రైమ్‌ కామెడీ జోనర్‌లో చాలా కథలొచ్చాయి. అయితే ఇప్పటి వరకూ ఈ జోనర్‌లో ఎవరూ టచ్‌ చేయని ఓ కొత్త ఎలిమెంట్‌తో ఈ సినిమా తీశాం. ఇలాంటి కథకు సహజత్వంతో ప్రాణం పోసే నటీనటులు దొరికారు. సూర్యతేజ పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. అన్ని అంశాలూ చక్కగా కుదిరాయ’’న్నారు దర్శకుడు. చిత్రీకరణ పూర్తయిందని, త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.

Updated Date - 2023-10-09T15:02:51+05:30 IST