కొత్తవాళ్లతో పది రూపాయల కథ

ABN , First Publish Date - 2023-04-13T03:27:06+05:30 IST

శ్రీకాంత్‌ చౌటపల్లి, పవిత్రా నారాయణ్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘10 రూపీస్‌’. అఫ్జల్‌ దర్శకుడు. వంశీకృష్ణ కన్నెగంటి సహ నిర్మాత. ఈ నెల 21న ‘10 రూపీస్‌’ విడుదలవుతోంది...

కొత్తవాళ్లతో పది రూపాయల కథ

శ్రీకాంత్‌ చౌటపల్లి, పవిత్రా నారాయణ్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘10 రూపీస్‌’. అఫ్జల్‌ దర్శకుడు. వంశీకృష్ణ కన్నెగంటి సహ నిర్మాత. ఈ నెల 21న ‘10 రూపీస్‌’ విడుదలవుతోంది. చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా అఫ్జల్‌ మాట్లాడుతూ ‘నేను ఎవరి దగ్గరా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయలేదు. కొత్తవాళ్లతో ఆరునెలల్లో ఈ సినిమా తీశాను. ప్రేక్షకులు ‘10 రూపీస్‌’ను ఆదరించాలి’ అని కోరారు. చిత్రబృందం అంతా ప్రాణం పెట్టి పనిచేశాం, తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని శ్రీకాంత్‌ చౌటపల్లి చెప్పారు. సినిమా చివరి 45 నిమిషాలు వేరె లెవల్‌లో ఉంటుందని వంశీకృష్ణ కన్నెగంటి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వంశీకాంత్‌ రేఖానా. సినిమాటోగ్రఫీ: చందు ఎ.జె

Updated Date - 2023-04-13T03:27:09+05:30 IST