శిఖరానికి అడుగు దూరంలో...

ABN , First Publish Date - 2023-01-25T01:44:19+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటునాటు’ పాట ఆస్కార్‌ అవార్డుకు నామినేషన్‌ దక్కించుకున్న సందర్భంగా ఆ చిత్ర బృందానికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు...

శిఖరానికి అడుగు దూరంలో...

ఆస్కార్‌ దక్కాలి : చంద్రబాబు ఆకాంక్ష

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటునాటు’ పాట ఆస్కార్‌ అవార్డుకు నామినేషన్‌ దక్కించుకున్న సందర్భంగా ఆ చిత్ర బృందానికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి మంగళవారం రాత్రి ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన విధంగానే ఆస్కార్‌ అవార్డు తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కూడా ఇదే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ.. హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సహా చిత్ర బృందం మొత్తానికి అభినందనలు తెలిపారు.

‘‘మన తెలుగు పాట ఆస్కార్‌ కోసం తుది బరిలో పోటీ పడడం అందరికీ గర్వకారణం. ఇంతటి ప్రాచుర్యం పొందేలా గీతాన్ని స్వరపరిచిన ఎం.ఎం.కీరవాణి గారికి అభినందనలు. ‘నాటు నాటు’ గీతం ఆస్కార్‌ అవార్డుని దక్కించుకోవాలి’’

పవన్‌ కల్యాణ్‌

సినీ వైభవ శిఖరానికి ఒక్క అడుగు దూరంలో నిలిచాం. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకున్న సందర్భంగా రాజమౌళి, కీరవాణి, చిత్రబృందానికి నా అభినందనలు.

చిరంజీవి

‘‘ఇదో అద్భుతం. సినిమా సెగలో మరో కలికితరాయి చేరింది. చిత్రబృందానికి అభినందనలు’’

వెంకటేశ్‌

‘‘కీరవాణి గారి తెరపై ఎన్టీఆర్‌, చరణ్‌లతో, బయట అందరితోనూ ‘నాటు నాటు’ స్టెప్పులు వేయించారు. ఇక నాటు దెబ్బ డైరెక్ట్‌ ఆస్కార్‌కే’’

రవితేజ

‘‘మనం చరిత్ర సృష్టించాం. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో 95వ అకాడమీ అవార్డ్స్‌కు ‘నాటు నాటు’ పాట నామినేట్‌ అయింది. ఈ గర్వించదగిన క్షణాలను మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా గర్వంగా ఉంది’’.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం

‘‘నాటునాటు పాట ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌కు నామినేట్‌ కావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందానికి నా అభినందనలు’’.

డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్‌

‘‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్‌ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. చిత్రబృందానికి అభినందనలు’’.

రాహుల్‌ సిప్లిగంజ్‌

‘‘భారతీయులం చరిత్ర సృష్టించాం. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో 95వ అకాడమీ అవార్డ్స్‌కు నామినేట్‌ అయినందుకు గర్వంగా ఉంది. ‘నాటు నాటు’ పాటకు దక్కిన గౌరవం ఇది’’.

బాలకృష్ణ

Updated Date - 2023-01-25T01:44:19+05:30 IST