గగనంలో సైనికుడి పోరుబాట
ABN , First Publish Date - 2023-07-05T02:48:10+05:30 IST
ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలపై ఫోకస్ పెట్టారు వరుణ్‌తేజ్. ఆయన హీరోగా బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ భాషల్లో...
ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలపై ఫోకస్ పెట్టారు వరుణ్‌తేజ్. ఆయన హీరోగా బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘వీటీ 13’ అనేది వర్కింగ్ టైటిల్. ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. వరుణ్‌తేజ్ వాయుసేన అధికారిగా కనిపించనున్నారు. చిత్రీకరణ దశలో ఉంది. కొన్నిరోజులుగా జరుగుతున్న మూడో షెడ్యూల్ చిత్రీకరణ మంగళవారంతో పూర్తయింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో భారీ పోరాట ఘట్టాలను తెరకెక్కించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో వరుణ్‌తేజ్ యూనిఫాంలో యుద్ధ విమానం ముందు నిల్చొని పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. ఈ చిత్రంలో వరుణ్‌కు జోడీగా మాజీ విశ్వ సుందరి మానుషీ చిల్లర్ నటిస్తున్నారు. ఆమె రాడార్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో టైటిల్‌ను ప్రకటిస్తామని నిర్మాణసంస్థలు తెలిపాయి.