చిరు సత్కారం
ABN , First Publish Date - 2023-03-29T02:46:25+05:30 IST
సోమవారం హైదరాబాద్‌లోని చిరంజీవి స్వగృహంలో రామ్‌చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి పలువురు సినీ సెలబ్రెటీలు హాజరయ్యారు...

సోమవారం హైదరాబాద్‌లోని చిరంజీవి స్వగృహంలో రామ్‌చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి పలువురు సినీ సెలబ్రెటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్కార్ సాధించిన ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్‌ని చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించారు. రాజమౌళి, కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కార్తికేయలను చిరంజీవి అభినందించారు. వెంకటేశ్, నాగార్జున, అఖిల్, నాగచైతన్య, అమల, విజయ్ దేవరకొండ, శ్రీకాంత్, నిఖిల్, అడవిశేష్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు ఈ విందులో పాల్గొన్నారు.