చివరి బంతికి సిక్సర్‌ కొడతా!

ABN , First Publish Date - 2023-10-02T01:25:10+05:30 IST

కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. రత్నం కృష్ణ దర్శకుడు. దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మాతలు. ఈనెల 6న విడుదల అవుతోంది....

చివరి బంతికి సిక్సర్‌ కొడతా!

కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. రత్నం కృష్ణ దర్శకుడు. దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మాతలు. ఈనెల 6న విడుదల అవుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ‘‘నేను నటించిన పూర్తి స్థాయి వినోదభరిత చిత్రమిది. గత మూడేళ్లలో ఎన్నో ఎత్తు పల్లాలు చవి చూశా. ఆ సమయంలో అభిమానులు నాకు అండగా ఉన్నారు. వాళ్లందరినీ సంతృప్తి పరిచే చిత్రమిద’’న్నారు. ‘‘నా తొలి చిత్రం 19 ఏళ్ల వయసులో చేశా. అప్పుడు నాకు రెహమాన్‌, పి.సి శ్రీరామ్‌లాంటి టాప్‌ టెక్నీషియన్లు దొరికారు. ఈ సినిమాకి మాత్రం నేనే సీనియర్‌ని. ‘ఆక్సిజన్‌’ సినిమా చేయడానికి నాకు పదిహేనేళ్లు పట్టింది. ‘రూల్స్‌ రంజన్‌’ నాకు దొరికిన చివరి బంతి. ఈ బంతికి సిక్సర్‌ కొడతా’’ అన్నారు దర్శకుడు. ‘‘దర్శకుడు ఈ చిత్రాన్ని బాగా తీర్చిదిద్దాడు. కిరణ్‌- నేహాలు కష్టపడ్డారు. వారి జంట ఆకట్టుకొంటుంద’’న్నారు నిర్మాతలు.

Updated Date - 2023-10-02T01:25:10+05:30 IST