చిరుజల్లులాంటి ప్రేమకథ
ABN , First Publish Date - 2023-09-11T01:58:02+05:30 IST
కృష్ణవంశీ హీరోగా పరిచయమవుతున్న ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శకత్వంలో హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు...

కృష్ణవంశీ హీరోగా పరిచయమవుతున్న ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శకత్వంలో హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష కథానాయిక. ఆదివారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను యూనిట్ విడుదల చేసింది. స్టైలిష్ లుక్‌లో హీరో, భరతనాట్య కళాకారిణిగా హీరోయిన్‌ను పరిచయం చేస్తూ రూపొందించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఆకాశ్‌రెడ్డి లఘు చిత్రాలు తీసి అవార్డులు అందుకున్నారు. కుటుంబంతో కలసి చూడాల్సిన చిత్రమిద’ని చెప్పారు. సరికొత్త ప్రేమకథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం ఓ చిరుజల్లులా హాయిగా ఉంటుందని దర్శకుడు అన్నారు. బ్రహ్మాజీ, సుధ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: శశాంక్ తిరుపతి