కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌

ABN, First Publish Date - 2023-12-18T00:36:21+05:30

చైతన్యరావు, హెబ్బాపటేల్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు...

చైతన్యరావు, హెబ్బాపటేల్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బాల రాజశేఖరుని దర్శకత్వంలో కె.కె.ఆర్‌, బాలరాజ్‌ సంయుక్తంగా నిర్మించారు. ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ తొలి పోస్టర్‌ను అక్కినేని నాగార్జున చేతుల మీదుగా యూనిట్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వినోదంతో పాటు సమాజానికి చక్కని సందేశం ఇచ్చే చిత్రమిది. కల్యాణి మాలిక్‌ పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవాలి’ అని ఆకాంక్షించారు. తెలుగు సినిమా చేయాలనే తన కల, నాగార్జున, అమల ప్రోత్సాహం వల్ల ఈ చిత్రంతో నెరవేరిందని దర్శకుడు తెలిపారు. ఇదొక రొమాంటిక్‌ కామెడీ ఎంటర్టైనర్‌, త్వరలో రిలీజ్‌ డేట్‌ వివరాలను ప్రకటిస్తామని నిర్మాతలు చెప్పారు.

Updated Date - 2023-12-18T00:36:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!