ఆకాశంలో ఆశల హరివిల్లు

ABN , First Publish Date - 2023-10-28T05:01:02+05:30 IST

కొరియోగ్రాఫర్‌ యష్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. కార్తీక మురళీధరన్‌ కథానాయిక. శశి కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు...

ఆకాశంలో ఆశల హరివిల్లు

కొరియోగ్రాఫర్‌ యష్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. కార్తీక మురళీధరన్‌ కథానాయిక. శశి కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హర్షిత్‌ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం నుంచి ‘శృంగార’ అనే గీతాన్ని శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. సంజిత్‌ హెగ్డే, మాళవికా శంకర్‌ ఆలపించారు. శశి కుమార్‌ సాహిత్యం అందించారు. కార్తీక్‌ స్వరాలు సమకూర్చారు. ‘‘సంగీతం, నృత్యం నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. పాటలకు ప్రాధాన్యం ఉంది. ‘శృంగార’ పేరుకి తగ్గట్టే.. రొమాంటిక్‌ గీతం. ప్రేమలోని స్వచ్ఛతని చూపిస్తున్నాం. వెండి తెరపై ఈ గీతం రంగుల హరివిల్లులా ఉంటుంది. అందరికీ నచ్చుతుంద’’ని దర్శకుడు తెలిపారు.

Updated Date - 2023-10-28T05:01:02+05:30 IST