హీరోగా పబ్లిసిటీ డిజైనర్‌!

ABN , First Publish Date - 2023-05-24T01:41:47+05:30 IST

వందకు పైగా చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా పనిచేసిన వివా రెడ్డి (విష్ణువర్థన్‌ రెడ్డి మావూరపు) ఇప్పుడు హీరోగా పరిచయమవుతున్నారు. ఆయన నటించిన ‘ఓ తండ్రి తీర్పు’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది...

హీరోగా పబ్లిసిటీ డిజైనర్‌!

వందకు పైగా చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా పనిచేసిన వివా రెడ్డి (విష్ణువర్థన్‌ రెడ్డి మావూరపు) ఇప్పుడు హీరోగా పరిచయమవుతున్నారు. ఆయన నటించిన ‘ఓ తండ్రి తీర్పు’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ప్రతాప్‌ భీమవరపు దర్శకత్వంలో లయన్‌ శ్రీరామ్‌ దత్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘తల్లితండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ కన్నవారి మీద లేకపోవడం ఎంత మానసిక క్షోభకు గురి చేస్తుందో ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని రూపొందించాం’ అని దర్శకుడు చెప్పారు. ‘ఇందులో కొడుకుగా నటిస్తున్న వివా రెడ్డి పాత్ర చాలా మంది కొడుకులకు కనువిప్పు కలిగిస్తుంది. ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది’ అని నిర్మాత తెలిపారు. రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనూరాధ కథానాయిక నటించారు.

Updated Date - 2023-05-24T01:41:55+05:30 IST