సైకలాజికల్‌ థ్రిల్లర్‌

ABN , First Publish Date - 2023-08-19T01:36:36+05:30 IST

‘ద కేరళ స్టోరీ’ చిత్రంతో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న అదా శర్మ నటిస్తున్న తాజా చిత్రం సి.డి.(క్రిమినల్‌ ఆర్‌ డేవిల్‌). సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రానికి కృష్ణ అన్నం దర్శకుడు.....

సైకలాజికల్‌ థ్రిల్లర్‌

‘ద కేరళ స్టోరీ’ చిత్రంతో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న అదా శర్మ నటిస్తున్న తాజా చిత్రం సి.డి.(క్రిమినల్‌ ఆర్‌ డేవిల్‌). సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రానికి కృష్ణ అన్నం దర్శకుడు. ఇప్పటివ రకూ వచ్చిన హారర్‌ జానర్స్‌లో కంటే ఆడియన్స్‌కు కొత్త అనుభూతి కలిగించే కథతో ఈ సినిమా రూపుదిద్దుకొంటున్నట్లు ఆయన చెప్పారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆదా శర్మ సీరియస్‌ లుక్‌, ఆమె చుట్టూ డెవిల్స్‌ హ్యాండ్స్‌ కనిపిస్తుండడం సినిమాలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. చిత్ర ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత గిరిధర్‌ మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడం కోసం కొత్తదారిలో వెళుతున్నాం. షూటింగ్‌ శరవేగంతో జరుగుతోంది. సినిమాకు సంబంధించిన అన్ని పనులూ పూర్తి చేసి అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చెప్పారు. విశ్వంత్‌, జబర్దస్త్‌ రోహిణి, భరణీ శంకర్‌, రమణ భార్గవ్‌, మహేశ్‌ విట్టా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన: ఎ.ముద్దుకృష్ణ, సినిమాటోగ్రఫీ: సతీశ్‌ ముత్యాల.

Updated Date - 2023-08-19T01:36:36+05:30 IST