పొలిటికల్ గేమ్ ఛేంజర్
ABN , First Publish Date - 2023-03-28T03:34:33+05:30 IST
రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రానికి ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్ ఖరారు చేశారు...

రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రానికి ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. సోమవారం చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ఆవిష్కరించారు. ఈ లుక్‌లో.. చరణ్ స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఓ యువకుడు రాజకీయాల్నీ, నాయకుల దృక్పథాన్నీ, ప్రజల ఆలోచనా విధానాన్నీ ఎలా మార్చాడు? పొలిటికల్ గేమ్ ఛేంజర్‌గా ఎలా అవతరించాడన్నదే కథ. అందుకే ఈ టైటిల్‌ని ఖాయం చేసింది చిత్రబృందం. కియారా అద్వాణి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, సునీల్, సముద్రఖని, ఎస్.జె.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: తమన్.