ది వ్యాక్సిన్‌ వార్‌ స్ర్కిప్ట్‌కు ఆస్కార్‌ లైబ్రరీలో చోటు

ABN , First Publish Date - 2023-10-13T00:40:40+05:30 IST

ఇటీవలే విడుదలైన ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం స్ర్కిప్ట్‌కు ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ లైబ్రరీలో స్థానం దక్కింది...

ది వ్యాక్సిన్‌ వార్‌ స్ర్కిప్ట్‌కు ఆస్కార్‌ లైబ్రరీలో చోటు

ఇటీవలే విడుదలైన ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం స్ర్కిప్ట్‌కు ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ లైబ్రరీలో స్థానం దక్కింది. ఈ విషయాన్ని వివేక్‌ అగ్నిహోత్రి సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ‘ఆస్కార్‌ అకాడమీ లైబ్రరీలో ‘ది వ్యాక్సిన్‌వార్‌’ చిత్రం స్ర్కిప్ట్‌కు శాశ్వతంగా చోటు దక్కింది. కొన్ని వందల ఏళ్లపాటు ఈ స్ర్కిప్ట్‌ను ఎంతోమంది చదువుతారు. మనదేశపు సూపర్‌హీరోల కథలను దీనిద్వారా ప్రపంచం తెలుసుకుంటుంది’ అని సంతోషం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్‌ను తయారుచేయడానికి భారత శాస్త్రవేత్తలు చేసిన కృషి నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.

Updated Date - 2023-10-13T00:40:40+05:30 IST