కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పరిపూర్ణమైన సినిమా స్కంద

ABN, First Publish Date - 2023-08-28T01:34:45+05:30

రామ్‌ - బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘స్కంద’. శ్రీలీల కథానాయిక. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. సెప్టెంబరు 15న విడుదల అవుతోంది...

రామ్‌ - బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘స్కంద’. శ్రీలీల కథానాయిక. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. సెప్టెంబరు 15న విడుదల అవుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ థండర్‌ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ ఆవిష్కరించారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘ఓ పాత్ర ఇస్తే దానికి వంద శాతం న్యాయం చేయడానికి నిరంతరం తపన పడే హీరో రామ్‌. తన విశ్వరూపం థియేటర్లలో చూడండి. ‘స్కంద’ పరిపూర్ణమైన సినిమా. అన్నిరకాల భావోద్వేగాలూ ఉంటాయి. గుండెల మీద చేయి వేసుకొని చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంద’’న్నారు. రామ్‌ మాట్లాడుతూ ‘‘ఐదేళ్ల క్రితమే మా కాంబో సెట్‌ కావాల్సింది. ఇన్నాళ్లకు కుదిరింది. బోయపాటి మొండిగా మాతో పనిచేయించుకొంటూ వెళ్లారు. ట్రైలర్‌లో చూసిన లుక్‌లోకి మారడానికి ఏడు గంటలు పట్టింది. తమన్‌ చాలా మంచి సంగీతాన్ని అందించారు. శ్రీలీలకు గొప్ప భవిష్యత్తు ఉంద’’న్నారు. ‘‘చాలామంది గొప్ప నటీనటులతో కలిసి పనిచే సే అవకాశం ఈ సినిమాతో నాకు దక్కింద’’న్నారు శ్రీలీల.

Updated Date - 2023-08-28T01:34:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!