కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సరికొత్త మర్డర్‌ మిస్టరీ

ABN, First Publish Date - 2023-11-29T01:01:53+05:30

నిర్మాత మోహన్‌ వడ్లపట్ల దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘ఎమ్‌4ఎమ్‌’ (మోటీవ్‌ ఫర్‌ మర్డర్‌). సంబీత్‌ ఆచార్య, జోశర్మ జంటగా నటించారు...

నిర్మాత మోహన్‌ వడ్లపట్ల దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘ఎమ్‌4ఎమ్‌’ (మోటీవ్‌ ఫర్‌ మర్డర్‌). సంబీత్‌ ఆచార్య, జోశర్మ జంటగా నటించారు. మోహన్‌ మీడియా క్రియేషన్స్‌, జో శర్మ మెక్విన్‌ గ్రూప్‌ సంయుక్తంగా నిర్మించాయి. మంగళవారం హైదరాబాద్‌లో నిర్మాత దిల్‌ రాజు చేతుల మీదుగా టీజర్‌ విడుదలైంది. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. మంచి చిత్రాలకు తప్పకుండా ఆదరణ లభిస్తుంది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకోవాల’’ని ఆకాంక్షించారు. ఎం.ఆర్‌.సి.చౌదరి మాట్లాడుతూ ‘‘డబ్బులున్నాయి కదా అని తీస్తున్న సినిమా కాదు. ఓ మంచి సినిమా చేయాలన్న ఆశయంతో తీస్తున్నాం. ఈ ప్రయాణంలో 20 - 30 కథలు విన్నాం. ‘ఎమ్‌4 ఎమ్‌’ అనేది ఓ సరికొత్త మర్డర్‌ మిస్టరీ’’ అన్నారు. ‘‘టీమ్‌ అంతా చక్కగా పని చేసింది. మేమంతా కలిసి ఓ మంచి సినిమా తీశామని నమ్ముతున్నామ’’న్నారు దర్శకుడు.

Updated Date - 2023-11-29T01:01:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!